Title: "Madhuram"
Special Thanks to IMovie Junction for Promoting this film
It's not a Love Story. But a Story about Love.
An Independent film from the Makers of Backspace.
Promoted on iMovie Junction
http://www.imoviejunction.com/twitter
http://www.imoviejunction.com/facebook
http://www.imoviejunction.com/googleplus
Language: Telugu

Genre: Love
సృష్టిలో మధురమైనవి చాలా వుంటాయి. వాటిని మన కళాదృష్టితో చూసినప్పుడే వాటి విలువ అర్ధమవుతాయి. సినిమాను మాధ్యమంగా, హాబీగా, టైం పాస్ గా చూసేవారు, తీసేవారే మనకు ఎక్కువ. కానీ ఒక కధను నరనరానా జీర్ణించుకుని, కధలో వుండే అణుకువని మనకు అనుకూలంగా మార్చుకుని ప్రతీ ఫ్రేము మనకు టైమును మరచిపోయేలా చేస్తూ తెరకెక్కించడం కష్టమైన విద్య.
3. సంగీతదర్శకుడు: ఒక సీన్ కు హృదయం కదిలించే భావుకత వుండచ్చు. కన్నీరు తెప్పించే పలుకులు పలికించచ్చు. కానీ వీటికి శ్రావ్యమైన సంగీతం తోడవ్వకపోతే ఊపిరి వున్నా జీవంలేనట్టే. ఒక గంట మొత్తంలో కూడా వెనుక బ్యాక్ గ్రౌండ్ వింటున్నామన్న ఫీలింగ్ కన్నా మన బ్యాక్ గ్రౌండ్ లో ఈ స్టొరీ జరుగుతుందన్న ఫీలింగ్ తీసుకురాగాలిగాడు. సున్నితమైన వాయిద్యాలతో సుకుమారమైన వైవిధ్యాలు తీసుకురావడం ఇతని నేర్పు. రసరమ్యసాగరానికి ప్రతీక ఇతని స్వరాల కూర్పు
ఎన్నో సో కాల్డ్ పెద్ద సినిమాలే చెయ్యలేని ఈ అద్భుతాన్ని ఒక చిన్న ఇండిపెండెంట్ సినిమా (పేరుకు మాత్రమే) చేసి చుపించుంది. ఒక గంట నిడివా?? అని ముందుగా అందరూ ఆశ్చర్యపోయినా సినిమా చూసాక అరెరే గంట అప్పుడే అయిపోయిందా ఇంకాసేపు తీసి వుంటే చాలా బాగుండేదే అని అనుకోని వారు చాలా అరుదు.
ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన ఆనలుగురు:
1. నటీనటులు: తెరమీద కనిపించేయాలి, వెక్కిలి వేషాలు వేసేయాలి, త్వరగా ప్రేక్షకుల మనసులోకి చేరిపోవాలి. చాలా మినీ మూవీస్ లో ఇవే సదరు హీరో లక్షణాలు. కానీ ఈ సినిమాలో హీరో హీరోలా వుండడు. కోతిచేష్టలు చెయ్యకుండా కేవలం ఇష్టాయిష్టాలను చూపిస్తూ ఒకే మూడ్ తో ఒకే టోన్ తో సినిమా అంతా కనిపించడం అతనకి ప్రతిభకు నిదర్శనం. హీరోయిన్ చాందినీ చౌది కూడా గోల్డెన్ డేస్ లో తెలుగింటి అమ్మాయిలా అందంగా కనిపించి మురిపించి మైమరిపించింది
2 మాటల రచయిత: భాషపై ప్రేమ వుంటేనే ఇలాంటి సంభాషణలు సాధ్యం. కధకు ఇంత దగ్గరగా, మన మనసులకు మరింత దగ్గరగా మీటుతూ మాటలను ఈ అందమైన తోటలో పొందుపరిచిన తీరు మరొకరికి అసాధ్యం. తెలివైన సంబాషణ, తెలుగింటి సంబాషణ ఒకేసారి చూపించడం రచయిత నైపుణ్యం. ఇలాంటి వారు దక్కడంతెలుగు సినిమా రంగం చేసుకున్న పుణ్యం. ఇతను అతి త్వరలో అత్యన్నత శిఖరాలు అధిగమించగలడు అనడం అతిశయోక్తి కాదేమో.
3. సంగీతదర్శకుడు: ఒక సీన్ కు హృదయం కదిలించే భావుకత వుండచ్చు. కన్నీరు తెప్పించే పలుకులు పలికించచ్చు. కానీ వీటికి శ్రావ్యమైన సంగీతం తోడవ్వకపోతే ఊపిరి వున్నా జీవంలేనట్టే. ఒక గంట మొత్తంలో కూడా వెనుక బ్యాక్ గ్రౌండ్ వింటున్నామన్న ఫీలింగ్ కన్నా మన బ్యాక్ గ్రౌండ్ లో ఈ స్టొరీ జరుగుతుందన్న ఫీలింగ్ తీసుకురాగాలిగాడు. సున్నితమైన వాయిద్యాలతో సుకుమారమైన వైవిధ్యాలు తీసుకురావడం ఇతని నేర్పు. రసరమ్యసాగరానికి ప్రతీక ఇతని స్వరాల కూర్పు
4. దర్శకుడు: భోజనం సిద్ధం. మరి అవి వడ్డించే ఆకు గురించి మాట్లాడకపోతే మన పొరపాటే. అందరూ సమానంగా పనిచేసినా దర్శకుడి విజన్ లేకపోతే ఈ సినిమా ఇంతటి మూడ్ ని క్యారీ చెయ్యడం అసాధ్యమనే చెప్పాలి. కాఫీ కప్పు తో స్టొరీ చెప్పించడం, దానికి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ క్రియేట్ చెయ్యడం. సినిమాలోతనకిష్టమైన సావిత్రి, రజినికాంత్ లకు తలెత్తుకునే రోల్స్ ఇవ్వడం, కేవలం 4 పాత్రలతో, 3 లోకేషన్ల మధ్యలో కధను నడిపించడం, సంస్కృతిపై మక్కువ వుండడం, పాత తరం ప్రేమికులపై అభిప్రాయాలు, వాటిని తెలివితేటలతో ఈ కధలో జోడించిన తీరు అసామాన్యం. సున్నితమైన ప్రేమకధలు తెరకెక్కించడంలో తనకంటూ ఒక మార్కును సృష్టించగలిగి తానే ఇకపై కొత్తవారికి బెంచ్ మార్క్ గా నిలిచాడు. ప్రేక్షకుల మదిని గెలిచాడు
సినిమా మొత్తం మూడు ప్రేమ కధలు. సినిమా చూసాక మన మనసును నెమరువేసే ఎన్నో చిలిపి స్మృతులు. ఇలాంటి సినిమా తియ్యడం ఒక భోగం. మనలాంటి వాళ్ళు చూడడం ఒక యోగం. తీయలేక/ చూడలేక పిచ్చి విమర్శలు చేయడం ఒక రోగం. హ్యాట్స్ ఆఫ్ తో ఎంటైర్ టీం. మీ మధురం.. నిజంగా సుమధురం..
Post a Comment Blogger Facebook